తెలంగాణ
యాదగిరిగుట్ట ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు.
ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగారు. రాత్రి 7గంటలకు స్వామివారిని బంగారు రథంపై అర్చకులు ఊరేగించనున్నారు. రథ సప్తమి వేడుకల్లో భాగంగా సువర్ణ పుష్పార్చనను ఆలయ అధికారులు రద్దు చేశారు.



