తెలంగాణ
Asifabad: అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్ల కలకలం

Asifabad: కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడి గుడ్ల పంపిణీ కలకలం రేపుతుంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడి గుడ్ల నుండి దుర్గంధం రావడంతో పగలగొట్టి చూడగా గుడ్డు లోపల కుళ్ళిపోయింది. ఇలాంటి గుడ్ల ను పిల్లలు చూసుకోకుండా తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలో కూడా జిల్లాలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగిన అధికారులు మాత్రం సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా హడావిడి చేయడం మళ్ళీ సమస్యను గాలికి వదిలేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడి గుడ్ల ఏజెన్సీలు,కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



