సినిమా
Rajamouli: హనుమంతుడిపై వ్యాఖ్యలు.. దర్శకుడు రాజమౌళిపై ఫిర్యాదు

Rajamouli: హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హనుమంతుడిపై అవమానకరంగా మాట్లాడారనే ఆరోపణలతో రాష్ట్రీయ వానర సేన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
హనుమంతుడిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, సినిమా పరిశ్రమలో దేవతలను అవమానించే ధోరణి పెరుగుతోందని ఆ సంస్థ ఆరోపించింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులు డిమాండ్ చేశారు.



