తెలంగాణ
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై డీజీపీ సీరియస్

నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటకు డీజీపీ ఆదేశించారు. ఐజీపీ చంద్రశేఖరరెడ్డి సంఘటనస్థలానికి చేరుకుని కేసు పురోగతిని పర్యవేక్షించాలని డీజీపీ ఆదేశించారు.
నిజామాబాద్‌లోని పాత నేరస్థుడు రియాజ్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో దారుణంగా పొడిచి పరారయ్యాడు. రియాజ్ దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరారైన పాత నేరస్థుడు రియాజ్‌ను పట్టుకునేందుకు సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులను కోరారు.



