తెలంగాణ
Revanth Reddy: హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: హైదరాబాద్ సీసీఎస్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ, సీపీ పాల్గొన్నారు. మిస్ వరల్డ్ నిర్వహణకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అతిథులు బస చేసే హోటళ్లతోపాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ పోటీలకు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం వివరించారు. అలాగే నగరంలో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.