సినిమా

Ram Charan: పెద్దితో రంగస్థలం రికార్డులు బద్దలు

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా సంచలనం సృష్టించనుంది. రంగస్థలం రికార్డులను బద్దలు కొడుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు.

రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్. 30 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రం రామ్ చరణ్ ఐకానిక్ మూవీ ‘రంగస్థలం’ కంటే మెరుగ్గా ఉంటుందని రామ్ చరణ్ లండన్‌లో చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

‘పెద్ది’ కథ, రామ్ చరణ్ పవర్‌ఫుల్ పాత్ర, భావోద్వేగాలు, యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? రంగస్థలం రికార్డులను అధిగమిస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button