సినిమా

రామ్ చరణ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయినట్టేనా? కొత్త ట్విస్ట్‌తో ఫ్యాన్స్‌కు షాక్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఆగిపోయిందా? ఈ ఊహించని మలుపు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊహించని అప్‌డేట్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా కోసం గతంలో చర్చలు జరిగినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కనపెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్‌తో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. సుకుమార్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కొత్త కాంబో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. త్రివిక్రమ్ కథ చరణ్‌కు నచ్చినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో ఈ జోడి మళ్లీ కలిసేనా? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button