Balakrishna-Rajinikanth: బాలయ్య-రజినీ కాంబో సంచలనం.. ‘జైలర్ 2’లో మాస్ ఎంట్రీ

Balakrishna-Rajinikanth: నందమూరి బాలకృష్ణ తమిళనాట సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’లో బాలయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జైలర్ 2’ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్ పాత్రలో మెరవనున్నారు. ‘జైలర్’లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కేమియో చేయగా, ఈసారి బాలయ్య పాత్రను 10 నిమిషాల హై-ఓల్టేజ్ ఎపిసోడ్‌గా రూపొందిస్తున్నారట.
నెల్సన్‌తో చర్చల్లో బాలయ్య తన పాత్రకు ప్రాధాన్యత కోరగా, దర్శకుడు దాన్ని శక్తివంతంగా డిజైన్ చేస్తున్నారు. రజినీ-బాలయ్య కాంబో తమిళ మాస్ సెంటర్లను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఉరకలు వేస్తున్నారు. ఈ సినిమాతో తమిళనాట బాలయ్య హవా ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.