Allu Arjun: బన్నీతో ప్రియాంక చోప్రా రొమాన్స్?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టైలిష్ హీరో, దర్శకుడు అట్లీతో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లైన్‌లో పెట్టాడు.
తాజా బజ్ ప్రకారం, ఈ బిగ్ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సంప్రదించారని సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ సరసన ఆమె హీరోయిన్‌గా కనిపిస్తుందా లేక కీలక పాత్రలో మెరుస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇది ఇప్పటికి గాసిప్ స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ, సినీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక, గత కొంతకాలంగా ఫామ్‌లో లేదనిపిస్తోంది.
అయినా, టాలీవుడ్ డైరెక్టర్లు ఆమె కోసం ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటిదాకా తెలుగులో రామ్ చరణ్‌తో ‘తుఫాన్’లో మాత్రమే నటించిన ఆమె, ఇప్పుడు అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో ఎంట్రీ ఇస్తే టాలీవుడ్‌లో సందడి మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ గాసిప్ నిజమై, ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మరోసారి తెలుగు స్క్రీన్‌పై ఆమె మ్యాజిక్ చూడొచ్చు. మరి ఈ డీల్ ఫైనల్ అవుతుందా? వేచి చూడాల్సిందే.