తెలంగాణ
నేడు మరోసారి సిట్ ఎదుటకు ప్రభాకర్ రావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నేడు మరోసారి సిట్ ఎదుట SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఈనెల 9న ఎనిమిది గంటలపాటు విచారించారు సిట్ అధికారులు.
అయితే విచారణలో తమకు ప్రభాకర్ రావు సహకరించలేదని అధికారులు ఇప్పిటికే చెప్పారు. ఇక ఇవాళ ఫోన్ ట్యాపింగ్తోపాటు రిటైర్డ్ తర్వాత కూడాప్రభాకర్ రావు కొనసాగడంపై విచారించే అవకాశం కన్పిస్తోంది. కాగా గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది.