తెలంగాణ
Ponnam Prabhakar: మహిళల ఉన్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది

Ponnam Prabhakar: మహిళల ఉన్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంఘాలకు 304 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించిందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలకు 5 కోట్ల 66 లక్షల 16 వేల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. ఆ లోన్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.



