ఆంధ్ర ప్రదేశ్
Vellampalli Srinivas: కూటమి పాలనలో దేవాదాయ శాఖ భూములకు భద్రత లేదు

Vellampalli Srinivas: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దేవాదాయ శాఖ భూములకు భద్రత లేదని ఆయన మండిపడ్డారు. గొల్లపల్లిలో వెంకటేశ్వరస్వామి భూమి 39ఎకరాలు కబ్జాకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎంపీ కేశినేని చిన్ని కుమ్మక్కు అయ్యి వందల కోట్ల భూములు కొట్టేస్తున్నారని అన్నారు. దీనిపై బీజేపీ చీఫ్ మధవ్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.



