తెలంగాణ
Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వంలా మాది ఫామ్‌హౌస్‌లో పడుకునే ప్రభుత్వం కాదు

Ponguleti Srinivasa Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాది ఫామ్‌హౌస్‌లో పడుకునే ప్రభుత్వం కాదని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పుణ్యపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. పేదవారికి భరోసా కలిపే భూములకు భద్రత కల్పించే విధంగా భూభారతి పనిచేస్తుందని అన్నారు. పేదవాడి శ్రేయస్ కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.