తెలంగాణ
లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించిన పోలీసులు

ఆషాడ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్‌దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి ఛత్రినాక సీఐ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారి లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి పోలీసుల తరపున బోనం సమర్పిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని ఏసీపీ తెలిపారు. బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.