జాతియం
Bombay Stock Exchange : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు

Bombay Stock Exchange: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌కి వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్, ఐఈడీ బాంబులు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ పంపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మధ్యాహ్నం 3గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవిస్తాయని కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉన్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందాలు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మెయిల్ పంపిన గుర్తు తె లియని వ్యక్తులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.