ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కార్డెన్ సెర్చ్

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పాపవినాశనం, ఆకాశగంగా, వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంతాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
దాదాపు 100 మంది పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. పాపవినాశనం, ఆకాశగంగా, వేణుగోపాలస్వామి పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
152 దుకాణాలలో తనిఖీలు చేసి, 46 దుకాణాలకు సరైన డాక్యుమెంట్స్ లేవని గుర్తించారు. మరోవైపు పదిమంది ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా అక్కడ పనిచేసినట్టుగా గుర్తించారు. రికార్డులు సరిగా లేని
ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.



