ఆంధ్ర ప్రదేశ్
PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

PM Modi: కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామికి పంచామృత రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి ఖడ్గమాల పూజ, కుంకుమార్చన పూజలు చేశారు.
పూజల అనంతరం ప్రధాని మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రంను సందర్శించి, అక్కడి దర్బార్ హాల్, ధ్యాన మందిరంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.



