ఆంధ్ర ప్రదేశ్
Modi: నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Modi: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా నా స్నేహితుడు చంద్రబాబుకు హ్యాపీ బర్త్ డే అంటూ రాసుకొచ్చారు ప్రధాని మోదీ. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి చంద్రబాబు పని చేస్తున్నట్లు చెప్పారు.
ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం అంటూ కొనియాడారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ తెలిపారు.