PM Modi: నేడు విశాఖలో ప్రధాని పర్యటన

PM Modi: ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు. రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్‌డ్రగ్ పార్క్‌కు అంకురార్పణ చేయబోతున్నారు ప్రధాని మోదీ.
అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్‌సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5లక్షల మందిని సమీకరిస్తున్నారు.