ఆంధ్ర ప్రదేశ్
కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్

కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు డబ్బు దాహంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. 17 మెడికల్ కాలేజీలను పప్పు, బెల్లం కోసం కేవలం ఒక్క రూపాయికే అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను 90 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.



