తెలంగాణ
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై గతంలో పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపింది . ఈ క్రమంలో ఆయనపై నమోదైన కేసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
పవన్ ఖేరాపై వారం రోజుల పాటు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది., అదే సమయంలో దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయనను ఆదేశించింది. ఈ మధ్యంతర బెయిల్‌తో ఆయనకు అరెస్టు ముప్పు నుంచి తాత్కాలికంగా రక్షణ లభించినట్లయింది. ఈ వివాదంపై అసోంలో కూడా కేసులు నమోదు కావడంతో, ఈ తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.



