సినిమా
Pawan Kalyan: అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చినమాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తిచేసి వెళ్తానన్నారు. అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ బయల్దేరనున్నారు.