తెలంగాణ
Hyderabad: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నేతలు యత్నించారు. దీంతో.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ ఆఫిస్ ముట్టడికి మాల మహానాడు నేతలు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో.. ముట్టడికి వెళ్తున్న వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.