Hyderabad: హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి

Hyderabad: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో జరిగిన ‘భారత మాతకు మహా హారతి’ కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గణపతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరోవైపు రెండు రోజులవుతున్నా ఈ ఘటన తరువాత అదృశ్యమైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంలో నాగారానికి చెందిన అజయ్ అదృశ్యమైనట్లు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో అజయ్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు లేక్ PSలో ఫిర్యాదు చేశారు.హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.