NTR: జపాన్‌లో ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు.. వైరల్

NTR: జపాన్‌లో ఎన్టీఆర్ తన భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. ప్రస్తుతం ఆయన జపాన్‌లో ‘దేవర’ సినిమా ప్రమోషన్స్ కోసం ఉన్నారు. ఈ నెల 28న జపనీస్‌లో చిత్రం విడుదల కానుంది. తొలి రోజు ప్రీమియర్ షోలో ఓ అభిమానితో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రెండో రోజు కూడా స్టైలిష్ లుక్‌లో జపాన్‌లోని ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు.
జపాన్ పర్యటనలో ఎన్టీఆర్ తో పాటు భార్య ప్రణతి కూడా ఉన్నారు. అదే సమయంలో ప్రణతి పుట్టినరోజు రావడంతో, నిన్న రాత్రి ఎన్టీఆర్ ఆ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అమ్మలు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా జపాన్‌లో ప్రణతి పుట్టినరోజు జరుపుకోవడం పట్ల ఆయన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా పిలుచుకునే ఎన్టీఆర్, సినిమా ప్రమోషన్స్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోని ఆనందకర క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.