సినిమా

Odela 2: ‘ఓదెల 2’ థియేటర్లలో హల్‌చల్.. ‘ఓదెల 3’ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్!

Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా నటనతో ‘ఓదెల 2’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ డివోషనల్ హారర్ డ్రామా రిలీజ్‌తో పాటు ‘ఓదెల 3’ అనౌన్స్‌మెంట్ సినీ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.

తమన్నా, వశిష్ట కీలక పాత్రల్లో నటించిన ‘ఓదెల 2’ నేడు గ్రాండ్ రిలీజ్ అయింది. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లాక్‌డౌన్‌లో ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది.

రిలీజ్‌తోనే మేకర్స్ ‘ఓదెల 3’ని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమన్నా నటన, హారర్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని టాక్. అజనీష్ లోకనాథ్ సంగీతం, డి. మధు నిర్మాణ విలువలు చిత్రానికి బలం. ‘ఓదెల 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button