Odela 2: తమన్నా ‘ఓదెల 2’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం..!

Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓదెల 2’ గురించి హాట్ అప్‌డేట్! హారర్, డివోషనల్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వివరాలు తెలుసుకుందాం..
తమన్నా హీరోయిన్‌గా అశోక్ తేజ దర్శకత్వంలో, సంపత్ నంది పర్యవేక్షణలో రూపొందిన ‘ఓదెల 2’ థియేటర్లలో పర్వాలేదనిపించింది. హారర్, డివోషనల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సాలిడ్ బిజినెస్ సాధించింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకుంది.
మే 16న లేదా అంతకంటే ముందే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చగా, డి మధు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్నా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.