ఆంధ్ర ప్రదేశ్
సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ఛైర్మన్ భేటీ

NITI Aayog: సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ఛైర్మన్ భేటీ అయ్యారు. అటు సచివాలయానికి వచ్చిన వైస్ ఛైర్మన్ సుమన్ బేరి బృందం చేరుకుంది. అయితే ఈ టీమ్‌కు ఆర్థిక శాఖ మంత్రి పయ్యా వుల కేశవ్ స్వాగతం పలికారు. చంద్రబాబు, పయ్యావులతో కలిసి నీతి ఆయోగ్ ఛైర్మన్ చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏపీ ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్‌పై చర్చి స్తున్నారు.
అదేవిధంగా ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌ను సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ కలిశారు.