జాతియం
Tahawwur Rana: తహవూర్ రాణాను విచారించనున్న ఎన్ఐఏ అధికారులు

Tahawwur Rana: ఉగ్రవాది తహవూర్ రాణాను.. కోర్టు, కస్టడీకి అనుమతించడంతో కాసేపట్లో NIA ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. విచారణపై NIA డీజీతో దర్యాప్తు బృందం విచారించనుంది. తహవూర్ రాణాను NIA కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో అధికారులు విచారించనున్నారు.
ప్రధానంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఉగ్రవాదులతో రాణాకు ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది NIA.పాక్ సైన్యం, ఐఎస్ఐతో సంబంధాలు 26/11 దాడుల్లో పాకిస్తాన్ పాత్రపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపించనుంది. తహవూర్ రాణా ఉన్న సెల్‌లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎంక్వైరీలో భాగంగా విచారణను వీడియో రికార్డ్ చేయనుంది ఎన్ఐఏ.