ఆంధ్ర ప్రదేశ్
Narayana: గత ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది

Narayana: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నామని, అమరావతిలో పెట్టుబడుల కోసం పెద్ద కంపెనీలు, బ్యాంకులు ముందుకువస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని ఏపీ మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం దురుద్దేశ్యపూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిందని నారాయణ విమర్శించారు. అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్‌గా నిలుపుతామని స్పష్టం చేశారు.