ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆయన శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.



