సినిమా

Chhaava Movie: 'ఛావా' సినిమాని నిషేధించాలంటూ.. అమిత్ షాకి ముస్లిం సంస్థ చీఫ్ లేఖ..!

Chhaava Movie: విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 800 కోట్లు దాకా ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. అయితే ఔరంగజేబు సమాధిని తొలగించాలనే వివాదం, నాగ్‌పూర్ ఘర్షణల నేపథ్యంలో ‘ఛావా’ సినిమాని బ్యాన్ చేయాలని ముస్లిం మతాధికారి డిమాండ్ చేశారు.

బరేల్వీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రని రెచ్చగొట్టే విధంగా చిత్రీకరించారని లేఖలో ఆరోపించారు. ఇది మతపరమైన అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపిస్తూ ‘ఛావా’ని నిషేధించాలని కోరారు.

ఆల్ ఇండియా ముస్లిం జమ్మత్ దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడైన రజ్వీ ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్ర హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా ఉందని, నాగ్‌పూర్లో చెలరేగిన మత హింస వంటి అశాంతిని కలిగించే విధంగా చిత్రీకరణ ఉందని పేర్కొన్నాడు.

ఛావా విడుదలైనప్పటి నుంచి దేశంలో వాతావరణం క్షీణించిందని, ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించి హిందూ యువతను రెచ్చగొట్టారని, అందుకే హిందూ సంస్థల నాయకులు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button