తెలంగాణ
కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన ఎంపీ ఈటల, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు ఈటల. ప్రధాని మల్కాజ్‌గిరి వచ్చినప్పుడు భారీగా జనాలు వచ్చారని.. అప్పుడు ఏదైనా ఘటన జరిగి ఎవరైనా చనిపోయి ఉంటే.. ప్రధాని మోడీని బాధ్యుడ్ని చేసేవారా అని ప్రశ్నించారు. కావాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించడం కూడా మంచి పద్దతి కాదని హితవు పలికారు ఈటల.