తెలంగాణ
Pocharam Srinivas Reddy: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థిక వేత్త మన్మోహన్

Pocharam Srinivas Reddy: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించారని కొనియాడారు. 10ఏళ్లు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని అన్నారు.