తెలంగాణ
MLC Kavitha: చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే.. బతుకమ్మ వందేళ్లు బతికి ఉంటది

MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 35 ఏళ్ల లోపు వయసున్న యువ కవులు అన్ని భాషల్లో కవిత్వం రాయాలనే ఆకాంక్షతో ఈ కవి సమ్మేళనం నిర్వహించామని కవిత అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రోజు అని ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నామన్నారు.
చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే బతుకమ్మ వందేళ్లు బతికి ఉంటదని ఆమె అన్నారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి పుట్టిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరమన్నారు. సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లిన నేల బాగుంటుంది అని ఆమె పిలుపునిచ్చారు.