తెలంగాణ
విషమంగానే ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స

Maganti: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గురువారం ఆయన ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా ఇంకా అపస్మారక స్థితి నుంచి మాగంటి గోపినాథ్ బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోందన్నారు.