తెలంగాణ
Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు..

Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సంవత్సరానికి రవాణా శాఖ ఎన్నో విజయాలతో ముగింపు పలికామన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణలు తీసుకువచ్చామని మంత్రి అన్నారు.
రోడ్డు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత సాధించామన్నారు. ఇప్పటివరకు 125.50 కోట్ల మంది మహిళలు, 4225 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేసి రికార్డు సృష్టించారన్నారు.