Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని ఆయన విమర్శించారు. ఆ 36 మందిలో ఎవరూ కూడా పదవికి రాజీనామా చేయలేదన్నారు.
కేసీఆర్ను సూటిగా అడుగుతున్నా ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదన్నారు. మీరు చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా..? అని ప్రశ్నించారు కడియం శ్రీహరి.
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. 15 ఏళ్లుగా వెనుకబడిన స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు నన్ను నమ్మి గెలిపించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు.



