Hyderabad: కుషాయిగూడలో మైనర్ బాలుడు హత్య

Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమ వ్యవహారం నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 ఏళ్ల అయాన్ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే అతనికి ఓ యువకుడు కాల్ చేసి తన ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావని బూతులు తిట్టాడు. రాధిక థియేటర్ సమీపానికి రావాలంటూ మాట్లాడుకుందామంటూ పిలిచాడు. అక్కడికి చేరుకున్న యువతి మాజీ ప్రియుడు మరికొంత మంది యువకులతో కలిసి బైకులపై వచ్చి అయాన్ పై దాడి చేశారు.
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన అయాన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయాన్ మృతి చెందాడు. హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునిపై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.