తెలంగాణ
Sridhar Babu: బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రి శ్రీధర్‌బాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక కుంకుమార్చన పూజలను నిర్వహించారు.