భద్రాచలంలో శ్రీరామనవమి శోభ

Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. రాములోరి కల్యాణానికి మిథిలా స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10గంటల 30నిమిషాలకు కల్యాణ మహో త్సవం ప్రారంభం కానుంది. రాములవారి కల్యాణానికి సీఎం రేవంత్ దంపతులు హాజరుకానున్నారు. నేడు కుటుంబసమేతంగా భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్నారు. రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను అందించనున్నారు.
రాములవారి కల్యాణానికి సీఎం రేవంత్ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు, న్యాయమూర్తులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు మరింత నిఘా పెంచారు. ఇక రాములోరి కల్యాణానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలనుండి కూడా భ క్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించనున్నారు.