ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ

Narayana: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించామని మంత్రి నారాయణ చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్టుమెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఆలిండియా సర్వీస్ అధికారులకు ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీనెస్ట్లో ఆరు టవర్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. వచ్చే మార్చ్ 31వ తేదీ లోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులని ఆదేశించారు మంత్రి నారాయణ.