ఆంధ్ర ప్రదేశ్

Minister Narayana: అమరావతిపై వైసీపీ నేతల ఏడుపులు ఆపాలి

Minister Narayana: అమరావతిపై వైసీపీ నేతలు వారి ఏడుపులను ఇకనైనా ఆపాలని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోన్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కొండవీటి వాగు నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సీఎండీ లక్ష్మీ పార్థసారథితో కలిసి ఆయా ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు.

విజయవాడలోని11 రోడ్డు వద్ద కొండవీటి వాగుపై నేషనల్‌ హైవేస్‌ అధికారులు ఓ వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో అక్కడ మట్టిని అలాగే వదిలేయడంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో వంతెన దిగువ నుంచి నీరు వెళ్లే మార్గం లేక నీరుకొండ పరిసర ప్రాంతాలలోని పొలాల్లో వరద నీరు నిలిచిపోయిందని మంత్రి వివరించారు. వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి నారాయణ అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button