తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. ఇక స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త చేయాలన్న సీఎం ఆలోచనతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్న లోకేష్‌కు శ్రీవారి ఆశీర్వాచనం ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధాని మోదీ సహకారం కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందున్నారు.



