తెలంగాణ
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన.. 8 మంది ఆచూకీ కష్టమన్న అధికారులు

Sigachi industry: సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 8 మంది ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చారు. వారు బూడిద అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
8 మంది కార్మికుల కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. 3 నెలల తర్వాత రావాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అప్పటివరకు కేంద్ర, రాష్ట్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని అధికారులు వెల్లడించారు.