Chiranjeevi: మెగాస్టార్‌పై జీహెచ్‌ఎంసీ అలసత్వం?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంటి పునర్మించడానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి కోరగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైకోర్టును ఆశ్రయించారు. సెలబ్రిటీలకే ఈ పరిస్థితి అయితే, సామాన్యుడి గతి ఏంటి? జీహెచ్‌ఎంసీ అలసత్వం వెనుక ఉన్న నిజాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన నివాసాన్ని పునర్మించడానికి అనుమతి కోరితే, అధికారులు స్పందించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సెలబ్రిటీలకే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.
జీహెచ్‌ఎంసీలో అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వారు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం, బ్యూరోక్రసీ జాప్యం సామాన్యుడి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? చిరంజీవి విషయంలో జీహెచ్‌ఎంసీ తీరు ఎందుకు ఇలా ఉంది? ఈ సమస్యల వెనుక అసలు కారణాలు ఏమిటి? సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.