జాతియం
Tamil Nadu: డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు

Tamil Nadu: తమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైలులోని అన్ని బోగీలు కాలిపో యాయి. పెరియకుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్రాక్ సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.
అరక్కోణం నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుతం కుప్పం రైల్వే స్టేషన్‌లో లాల్‌బాగ్ సూపర్ ఫాస్ట్ నిలిచిపోయింది. మరోవైపు రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.