Shefali Jariwala: షెఫాలీ జరివాలా మరణంపై సంచలన వివరాలు!

Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ నటి షెఫాలీ జరివాలా అనూహ్య మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. 42 ఏళ్లలోనే కన్నుమూసిన ఆమె మరణం చుట్టూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన నటి షెఫాలీ జరివాలా జూన్ 27న అకస్మాత్తుగా మరణించారు. ముంబైలోని ఆమె నివాసంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇంట్లో జరిపిన తనిఖీల్లో యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు, గ్లూటాథియోన్ వంటి ఔషధాలు లభ్యమయ్యాయి. మరణ రోజున షెఫాలీ ఉపవాసంతో పాటు గ్లూటాథియోన్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు తేలింది.
ఖాళీ కడుపుతో ఈ ఔషధం తీసుకోవడం ఆమె రక్తపోటు పడిపోయేలా చేసి, గుండెపై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి కుట్ర కోణం కనిపించనప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదిక, ఔషధాల ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఘటన అందం కోసం అనవసర ఔషధాల వాడకంపై ఆలోచనకు గురిచేస్తోంది.