అంతర్జాతీయం
Earthquake: కొత్త సంవత్సరం వేళ జపాన్లో భూకంపం

Earthquake: నూతన సంవత్సరం వేళ జపాన్లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది.
ఇటీవల 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అనేక ప్రాంతాలను కుదిపేసింది. అప్పుడు 30 మంది గాయపడ్డారు. 90 వేల మంది నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు 6 తీవ్రతతో భూకంపం సంభవించింది.



