Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధించిన లక్నో కోర్టు

Rahul Gandhi: సావర్కర్‌పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు 200 జరిమానా విధించింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రాహుల్‌కు జరిమానా విధించింది. వచ్చే ఏప్రిల్ 14న కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సావర్కర్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, తద్వారా మహాత్మాగాంధీ, ఇతర స్వాంతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం లక్నో కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. 2025 జనవరి10న కోర్టు ముందు హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.
అయితే రాహుల్ హాజరు కాలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు.. రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని మరోసారి నోటీసులు సైతం జారీ చేసింది.